ఆ తరువాత నాకు యాభై సంవత్సరాల వయస్సులో కానీ అమ్మ అర్థం కాలేదు. ಓ రోజు గౌతమ బుద్ధుని కథలు ౘదువుతూ వుంటే ఒక కథ నన్ను ఆకట్టుకునింది.

గౌతమ బుద్ధుడు ఒక మఱ్ఱిచెట్టు క్రింద కూర్చుని ధ్యాన మగ్నుడై యున్నాడు. ఆ దారిన వెళ్ళే ఒక బ్రాహ్మణునకు గౌతమ బుద్ధుని చూడగానే కోపం ముంౘుకొచ్చింది. రౌద్ర రూపందాల్చి బుద్ధుణ్ణి తిట్టటం మొదలు పెట్టాడు. ” నీవు ఉత్త సోమరి పోతువి. పరాన్న బుక్కువు. ధ్యానం పేరుతో సోమరిపోతు వయ్యావు. పని పాట లేకుండా తిని కూర్చుంటున్నావు ”

బుద్ధుడిలో చలనంలేదు. మళ్ళీ తిట్ల దండకం మొదలు పెట్టాడు. ” నీవు దౌర్భాగ్యుడివి, యువకులందరిని సోమరిపోతులుగా తయారు చేస్తున్నావు. భార్యా బిడ్డలకు అన్యాయం చేశావు. పెండ్లి చేసుకుని , పిల్లవాడు పుట్టిన తర్వాత దొంగ సన్యాసం పుచ్చుకున్నావు.” అయినా బుద్దుడి ముఖంలో ప్రేమ భావన తప్ప ఇంకేమీ కనిపింౘ లేదు. ఆ బ్రాహ్మణుడు ఇంకా రెచ్చి పోయాడు.

” యువతీ యువకులకు సన్యాసమిప్పించి వ్యభిచారులుగా చేస్తున్నావ్ “. అంటూ తూలనాడాడు. అయినాసరే బుద్ధుడికి కోపం రాలేదు. కోపం వస్తే ఆయనతో వాగ్వివాదం పెట్టు కోవాలని ఆయన పన్నాగం. ” ఇన్ని తిడుతున్నా సిగ్గు, శరం లేదా ? నోటమాటరాదా ? అంటూ మరీ రెచ్చిపోయాడు. అప్పుడు బుద్ధుడు కళ్ళు తెరచి చిరునవ్వుతో ” ఇప్పుడు మీరన్న మాటలు ఏవీ నాకు సంబంధించినవికాదు. అందుకేనేను ఆ మాటలను స్వీకరింౘలేదు. అవన్నీ నీదగ్గరే ఉన్నాయి ” అన్నాడు బుద్ధుడు. రెచ్చిపోయిన బ్రాహ్మణుడు అ దెెట్లో చెప్పమన్నాడు. “. ఇప్పుడు మీరెవరికైనా నాలుగు నాణేలు ఇచ్చారనుకో. అవివారు తీసుకుంటే వారివి అవుతాయి. మరి తీసుకోకుంటేనో….. ?”. అన్నాడు బుద్ధుడు. “వారుతీసుకో కుంటే… నావి నాదగ్గరే వుంటాయి “_అన్నాడు బ్రాహ్మణుడు. ” తిట్లు నేను స్వీకరింౘలేదుకదా ? అప్పుడు అవి నీ దగ్గఱే వుంటాయి గదా “. అని చిఱునవ్వు తో చెప్పాడు బుద్ధుడు. విషయం అర్థమైన బ్రాహ్మణుడు తన తప్పు తెలుసుకుని బుద్ధుడి కాళ్ళమీద పడి వేడుకుని సన్యాసం స్వీకరించాడు.

ఈ కథ ౘదివిన తర్వాత యాభైయేండ్ల వయస్సు లో అర్థమయ్యింది అమ్మ పలికిన ఆనాటి మాటకు అర్థం. అంతవరకు అందరిమాటలకు స్పందించి, మాటల మూటలను మో సి మోసి జీవితం భారంగా అనిపిస్తుండేది. అర్థమైన తర్వాత మాటల మూటల భారం లేకుండా జీవితం తేలికగా ఆనందంగా గడుపు తున్నాను.

ఆ తరువాతి కాలంలో ” జిడ్డుకృష్ణమూర్తి” గారిని అధ్యయనం చేసే సమయంలో వారి కొటేషన్స్ కొన్ని అర్థమైన తర్వాత అప్పటి సమస్యను మా నాన్న అంతబాగా ఎలా పరిష్కరిం చాడో అర్థమైంది.

” If we can really understand the
problem, the answer will come
out of it, because the answer is
not separate from the problem ”
— J. Krishnamurti

” If you really want to live a life
in which there is no conflict, you
have to find out how to end a
problem immediately ”